Monday, 30 July 2018

బయో మైనారిటీల విషమ సమస్య



నిరాయుధులైన పాలస్తానీయుల్ని ఇజ్రాయెల్ స్నైపర్లు చేస్తున్న హత్యాకాండతో - గాజా తదితర ఆక్రమిత ప్రాంతాలలో మానవజీవితం మరింత పతనమైంది. రోహింగ్యాలని - మియాన్మార్ లో జెనోసైడ్ చెయ్యడం, ఇండియా, బాంగ్లాదేశ్, ఇండోనేషియా, థాయ్ లాండ్, ఇంకా మిగిలిన ఆసియా దేశాలలో అవమానాలకి గురి చెయ్యడం. కాశ్మీరులో సామాన్యుల ఇష్టాయిష్టాలతో సంబంధంలేకుండా ఇండియన్ మిలిటరీ స్థావరం ఏర్పరుచుకోడం – ప్రతీ ఒక్క సందర్భంలోనూ, టార్గెట్ అయిన కమ్యూనిటీలు ముస్లింలే, కాని విభిన్నమైన చారిత్రక సందర్భం కలిగిన సమూహాలు. ఈ సమూహాలన్నిటి ఊచకోతల వెనకనుండి నడిపించే చలనసూత్రం ఏది, పైపైన చూస్తే, అది ప్రధానంగా వారు ముస్లింలవడమే అనిపించవచ్చు – కాని అది వాస్తవం కాదు.
ఎక్కడెక్కడ నివసించే ముస్లింలంతా –ఒకటే  విశ్వమానవ సమూహం (అది కూడా ఒకే మాట మీద, పూర్తి సమన్వయంతో నడుచుకునే సమూహం) లో భాగాలన్నట్టు -  ఊహించడం, చూపించడం – ఒక మిథ్య.  కొన్ని ప్రత్యేకమైన పాశ్చాత్య, ముస్లిం  రాజకీయ మత శాస్త్రాలు కలిపి అల్లిన వల. దానిని స్వయంనిరూపక  నిత్యసత్యం అని భావించడం పొరపాటు. గాజాలో ఇజ్రాయెల్ సాగించే -ఒక చోటికి చేర్చి, ఎక్కడి కీ పోనీకుండా కాపలాకాసి, ఆకలితో మాడ్చి చంపే – నిర్బంధ మారణకాండ carceral genocide.
ఏ స్థిరమైన జీవికా మిగలనీకుండా బయటికి పెకిలించి చెదరగొట్టి, చావును చేరుకునే దాకా  వారిని తరిమికొట్టే - వలస జాతుల మారణకాండ diasporic genocide.
bipolar condition of biominorities
1.     అతి శక్తివంతమైన మిలిటరీ ఉంది ఇజ్రాయెల్ వద్ద, పాలస్తీనా వారిని తేలికగా తరిమెయ్యవచ్చు కదా – ఎందుకలా చెయ్యదు?
 1A:
·        ఆ పాలస్తీనా వారికి సాయుధ ప్రతిఘటనలో సుదీర్ఘ చరిత్ర ఉంది, మిడిల్ ఈస్ట్ దేశాలు సహాయం చేసిన సందర్భాలూ ఉన్నాయి (ఈమధ్యనే ఇరాన్ సహాయం చెసింది.) పట్టుదలగా పోరాడతారు గనక వారిని నిర్బంధించి చంపాలి.
·        బంధించబడిన పాలస్తీనా జనాభా ఎదురుగా లేకుంటే – ప్రస్తుతం అధికారం చెలాయిస్తున్న మతతత్వ రైట్ కి గానీ, జనామోదం పొందిన బెంజమిన్ నెతనాయూ అథారిటేరియనిజంకి గానీ అస్థిత్వమే మిగలదు.  టర్కీలోకుర్దులూ, హంగరీలో యూదులూ, ఇండియాలో ముస్లింలూ – ఇలాటి కంటికి కనబడే బయోమైనారిటీలు లేకపోతే – ప్రజాస్వామ్యమనే పెద్ద ప్రమాదం విరుచుకుపడుతుంది. ఇజ్రాయిల్ మతతత్వ రాజకీయాలకు అది సుతరామూ పనికిరాదు. ఇక డొనాల్డ్ ట్రంప్ కైతే తన క్లైంట్ దేశాలు మితవాదులౌతారని సూచనాప్రాయంగా అనిపించిందో – అస్సలు గిట్టదు.

2.మియన్మారులో రోహింగ్యాలని – నిర్బంధించి, శిక్షించి, పస్తులుంచి చంపొచ్చు కదా, ఎందుకు చెయ్యరు?
2A:  పశ్చిమతీరంలో సారవంతమైన భూభాగాలను సాగులోకి తెచ్చుకుని రోహింగ్యాలు - శతాబ్దాల తరబడి బలంగా పాతుకుపోయి ఉన్నారు. ఆ భూములన్నీ పోర్టుల నిర్మాణానికీ, బంగాళాఖాతంలో రవాణా అభివృద్ధికీ – అనువుగా ఉన్నాయి. వారు అక్కడ నుంచి పోవాలి, హత్య, రేప్, సైన్యంతో అణచివేతా – ఇవన్నీ వారిని బయటికితోసేసే ఉద్దేశంతోనే జరుగుతున్నాయి. ఎత్నిక్ జాతుల నాశనం కోరే బౌద్ధ సన్యాసగణాలు – భావజాలపు ఇంధనాన్ని అందిస్తోంది, సైనిక పాలనలో ఇష్టపూర్వకంగా పాలుపంచుకోంటోంది. రోహింగ్యాలు ముస్లింలవడం, మెజారిటీ అయిన బౌద్ధులకు వివాదాస్పదం అవుతున్న మాట నిజమే కానీ రోహింగ్యాలు బలహీనులవడం, మియన్మార్ సముద్రతీరంలో – గ్లోబల్ ఆయువుపట్లనదగ్గ జాగాలలో వారు నివాసాలుండడం – ఈరెండు విషయాలే వారి ఊచకోతకి అసలు కారణాలు.
నేషన్ స్టేట్ లనే హర్మ్యాలన్నీ – కల్తీ లేని జాతి అనే భావన మీదా, తమ జాతి విశేషత మీదా – (కొన్ని బయటకి కనిపించనీయవు గానీ) తమ పునాదిని వేసుకుంటాయి. మైనారిటీ జాతుల బహుళత్వం ఈ ఆధునిక నేషన్ స్టేట్ లకి ఎప్పుడూ కంటిలో నలుసు లాగే కనిపిస్తుంది.  
కనక రకరకాల మారణకాండలన్నీ – మతానికి సంబంధించినవి కాదు, ఉన్మాదవాదపు/ దోపిడీదారు (లేదా రెండూ) - నేషన్ స్టేట్ లకి సంబంధించినవి.

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. కాశ్మీర్ లో దిక్కు లేని స్థితి కల్పించబడ్డ హిందువుల పరిస్థితి ఏరకమైనదో చెప్పగలరా

    ReplyDelete