Wednesday, 16 December 2015

స్వచ్చ భారతం

Swachh Bharat Abhiyan: World Bank Approves $1.5 Billion for Indian Government's Campaign
The bank approved the loan for Narendra Modi's Clean India mission to improve nationwide sanitation by 2019. The World Bank says 750 million people in India lack access to improved sanitation.

స్వచ్చ భారతం ఎలా సాధించాలో ప్రభుత్వం వారు వెయ్యి గొంతుకలతో ...వెల్లడించాక, ఒకరి తల పండులో ఒక గొప్ప విత్తనం అంకురించింది, ప్రజల సోమరితనం పోగొట్టి, వారిని 'చెంగు చెంగునా గంతులు వెయ్యండీ, ఓ జాతి వన్నె తువ్వాయి ల్లారా!అని పాటల్లో చెప్పినట్టూ... వారిలో ఉత్తేజం నింపడానికి ఒక గొప్ప, పైసా ఖర్చులేని, మన చేతికి మట్టి అంటుకోని (ఔను, అచ్చంగా స్వచ్చ భారత్ లాగానే) ఒక అమూల్య పధకం! ఇదిగో యిదీ!!!
  

దేశం శుభ్రపడా లంటేమన పన్నులతో ఎన్నికైన ప్రభుత్వం మహా తెలివిగా మననే చీపురు పట్టుకోమనిమన ఖర్చు తోనే  దండోరా వేస్తోంది. మనని శుభ్రంగా ఉండమంటున్నారుకాస్త సంఘసేవ చెయ్యమంటున్నారు,అందులో తప్పేముంది?” అనుకుంటున్నారాఐతే పప్పులో కాలేసారన్నమాటే....

పోనీ, ప్రభుత్వం వారు చెప్పిన మాట మంచిదేనేమోలే, విందామని నేను కూడా ఆశపడ్డాను. నాలుగు మూలలా చూసాను. నిజమే! ఎక్కడ చూసినా మురికి! పైదేశాలలో ఇలాగే ఉంటుందా? విదేశీ టూరిస్టులుమన ఎన్నారైలు దేశం చూద్దామని వస్తే! మన పరువంతా పోతోందేఈ దుర్వాసనలూ అవీ... వీధి పక్కన మలమూత్రాలు ...ఛీ! ఛీ!  ... ఎంత అశుభ్రం! 


పదండి చీపుళ్ళూచేటలూ తీసుకుని శుభ్రం చేసిమందులు జల్లి రోడ్డులన్నీ అద్దం లా చేసేద్దాం! దేశ ప్రతిష్టను కాపాడదాం!

ఐతేఒక్క మాట చెప్పండిఅవి ఎవరివీమీవీనావీ కావు కదా...మన ఇళ్లల్లో సెప్టిక్ లావట్రీలు వదిలి రోడ్డుమీద మనం ఐతే కూర్చోలేదు కదారోడ్డు పక్క గుడిసెల్లోబ్రిడ్జీల కిందాభయంకరమైన ఈగలుదోమలూ ముసిరే ఆ రైల్వేబస్టాండుల దగ్గరా రోజులు వెళ్ళమార్చే వాళ్ళే కదా ఈ మల మూత్రాలను విసర్జించేదీ...ఇవేళ మనం శుభ్రం చేసి వెళ్ళిపోయాక వారికి కొత్త ఇళ్ళు గట్రా ఏమీ తయారవడమైతే లేదు కదాలేక  రేపట్నించీ వారికి ఆ మలమూత్రాలు రాకుండా ఏమన్నా మందు గానీ ఇస్తున్నారా ఈ ప్రభుత్వం వారు?

అన్ని విషయాలూ వదిలేసారు - వారి జీవనోపాధి విషయం కాదువారి వసతుల గురించి కాదువారికి విద్యా వైద్య సదుపాయాలు కాదువారి రక్షణ ఏర్పాట్లు కాదు, వారి చలీ ఎండావారి తిండీ నీరూ నిద్రా  సరేసరి! 

ఇవేవీ ప్రభుత్వం బాధ్యత కాదని వదిలించుకున్నారుమరి వారి ప్రియ పౌరులకి’  ఇబ్బంది కలిగించేస్తున్న మల మూత్ర విసర్జన కైనా ఒక మార్గాంతరం చూపించాలా? కనీసం దానికైనా ఈ ప్రభుత్వం వారు ... బాధ్యత పడాలావద్దా?

"అదే కదా... ఆ బాధ్యత తోనే  స్వచ్చ భారత నిర్మాణం సాగిస్తున్నాం" అని అంటారేమో వీళ్ళు....ఈ  కబుర్లు రేడియోలూటీవీల్లోనూ విని విని బుర్ర వాచిపోతోంది. ఈ బద్ధకం పోగొట్టే ప్రణాళిక లాగే ఉంది వీళ్ళ స్వచ్చ భారత నిర్మాణం !..."అశుభ్రత పారద్రోలాలంటే నలుగురూ ఏం చెయ్యాలో నువ్వు చెప్పేదేమిటినువ్వు చెయ్యాల్సినది నువ్వు చెయ్యకుండా" ....అని ఎవరూ వీరికి గడ్డి పెట్టొద్దాకనీసం ఓ వంద మందికి ఒకటైనా పాకీ దొడ్లు కట్టించి ఇచ్చి, “ఇంతే మాకు చేతనయిందివీటిని శుభ్రంగా వాడుకోండి” అంటూ పోనీ వారి డప్పువారు  మోగించుకుంటే అదో తీరు.  ఈ స్వచ్చ భారతం వంక తో’ నైనా ఒక చిన్న మంచి పని జరుగుతోన్దని సంతోషిద్దుం!

కానీ ఇదేం మోసం? "మీ ఇళ్లల్లో పాకీ దొడ్లు కట్టుకుని వాడుకోండి! బయట మాత్రం పాడు చెయ్యకండి" అని విద్యా బాలన్లూ మరొకరూ ప్రచారాలాదానికా ప్రభుత్వం చేతిలో వార్తా సాధనాలున్నది?

ఇంకా ప్రశస్తమైన విషయం మరొకటుంది. ప్రజలను మరుగు దొడ్లు కట్టుకోమని ప్రబోధిస్తున్న ప్రభుత్వం, నిరుడు సుప్రీం కోర్టు రూలింగ్ ఇస్తే తప్ప ఎన్నో ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క టాయిలెట్టూ కట్టకుండా జరుపుకుంటూ వస్తోంది. మరి ఆ పిల్లలూ, ఉపాధ్యాయులూ దైవాంశ సంభూతులని నమ్ముతోందేమో...వారికి మరుగుదొడ్లు అక్కరలేదా?

ఇప్పుడు వాటిని అతికష్టం మీద కట్టాక, వాటిని శుభ్రపరిచేందుకు కార్మికులను నియమించదట. పాపం నిధులు లేవుగా మరీ...ఆ చిన్నపిల్లలే, క్లాసురూములూ, ప్లే గ్రౌండ్లూ, మరుగుదొడ్లూ- అన్నీ శుభ్రపరుచుకోవాలి కాబోలు. చాలా స్వచ్చంగా ఉండబోతున్నాయి మన ప్రభుత్వ పాఠశాలలు.   

                              

ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటేమరో సారి ఏదైనా ఇలాటి పధకాలు మన చెవిన పడితేఆ పధకాలు వేసేవారిని నిలదీసి అడగాలినువ్వేం చేస్తున్నావోలేదా చేస్తావో చెప్పు అని .... దెబ్బకి పనేనా చేస్తారు,  చెయ్యకపోతే కనీసం నోరైనా మూసుకుంటారు!      






5 comments:

  1. మోడీ నా కంటపడితే (కాలర్ లేని) షర్ట్ పట్టుకుని "చాకిరేవు"లో ఉతుకుతా ! మీరు ఇపుడు చెప్పారు కదా,ఇద్దరం కలిసి నిలదీద్దాం,చెప్పండి ...ఎలా నిలదీయాలి ?

    ReplyDelete
  2. చదివి 'ఔనని'తలూపుతోనో, లేక 'కాదని'పెదవి విరుస్తూనో ఉండిపోకుండా మీరు ఇలా స్పందించడం ఒక రకంగా నిలదీయడమే...ఎవరూ నేర్పకుండానే చేస్తున్నారు కదా. దీనిని ఇలాగే కొనసాగించండి నీహారిక గారూ!

    ReplyDelete
  3. మా ప్రాంతంలో బ్రాహ్మణ స్త్రీలు కూడా గెడ్డ దగ్గరే మల విసర్జన చేస్తారు. వాళ్ళు మరుగుదొడ్లు లేక చదువు మానెయ్యడం విచిత్రమే. పెన్నికోణ అనే గ్రామంలో మరుగుదొడ్లు ఉన్నాయి కానీ వాటిని శుభ్రంగా ఉంచేవాళ్ళు లేరు.


    ReplyDelete
  4. Well expressed...this is like treating the symptom and not the disease...

    ReplyDelete
  5. Well expressed...this is like treating the symptom and not the disease...

    ReplyDelete